New Muslims APP

తౌహీద్‌ ప్రధానం

ప్రశ్న: ప్రవక్తలందరి తొలి సందేశం ఏమిటి?
జ: తౌహీద్‌. అల్లాహ్‌ ఖుర్‌ఆన్‌లో ఇలా సెలవిచ్చాడు: ”మేము ప్రతి జాతిలోనూ ప్రవక్తను ప్రభవింప జేశాము. అతని ద్వారా (ప్రజలారా!) ‘అల్లాహ్‌ను మాత్రమే ఆరాధించండి. ఆయన తప్ప ఇతరత్రా మిథ్యా దైవాల (తాగూత్‌)కు దూరంగా ఉండండి’ అని బోధ పరచాము”. (అన్నహ్ల్‌: 36)

ముస్లింలలో అవిశ్వాస పోకడలు చాప క్రింది నీరులా ప్రవేశించాయి, ప్రవేశి స్తున్నాయి అని చెప్పొచ్చు. మన తాత ముత్త్తాతలు ఆ కాలంలో ఇస్లామీయ సాహిత్యం లేని కారణంగా, హలాల్‌ మరియు హరామ్‌ గురించి చెప్పే వారు లేని కారణంగా మనలో ఇలాంటి విషయాలు చోటు చేసుకు న్నాయి. అలాగే కుట్ర పూరితంగా కొందరిని పావులుగా చేసి ఇస్లాం ధర్మాని కి ఊపిరి విం తౌహీద్‌కు తూట్లు పొడిచే ప్రయత్నాలు పెద్ద ఎత్తున జరిగాయి.

ప్రశ్న: తౌహీద్‌ అంటే ఏమిటి?
జ: ఖుర్‌ఆన్‌ ద్వారా శాస్త్ర బద్ధంగా, హథీసు ద్వారా ప్రామాణికంగా నిర్దేశించ బడిన ఆరాధనల్లో ఏకైక పూజ్యనీయునిగా, గుణ నామాల్లో అద్వితీయునిగా అల్లాహ్‌ను విశ్వసించడం.
ప్రశ్న: ఆరాధన – ఇబాదత్‌ అని దేన్నంటారు?
జ: అల్లాహ్‌కు ఇష్టమయిన వాక్కు పరమయిన, దేహ పరమయిన, అంతరంగిక పరమయిన కర్మలు.

ప్రశ్న: అంటే?
జ: వాక్కు పరమయిన కర్మలు అంటే, ‘అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్‌’ సాక్ష్యం ఇవ్వడం, సుబ్హానల్లాహ్‌, అల్‌హమ్దులిల్లాహ్‌ చెప్పడం. ఖుర్‌ఆన్‌ పారాయణం చెయడం మొదలయినవి. దేహ పరమయిన కర్మలు అంటే, అయిదు పూటల నమాజు స్థాపించడం, రమజాను పూర్తి మాసపు ఉపవా సాలు ఉండటం, హజ్జ్‌ చెయ్యడం మొదలయినవి. ఇందులోనే ధన పరమ యినవి అంటే, జకాత్‌ చెల్లించడం, దాన ధర్మాలు చెయ్యడం, అనాథ ఆశ్ర మం, పాఠశాల, మస్జిద్‌ నిర్మించడం మొదలయినవి ఉన్నాయి. అంతరంగిక కర్మలు అంటే, సంకల్పం, భయం, ఆశ, భరోసా మొదలయినవి.

ప్రశ్న: పై ఆయతులో తాగూత్‌ అంటే (మిథ్యా దైవాలకు) అన్నారు. అంటే ఏమిటి?
జ: తాగూత్‌ అనేది అరబీ భాషా పరంగా తుగ్యాన్‌ అనే మూల పదం నుండి తీసుకోబడింది. దానర్థం – హద్దును అతిక్రమించడం. సత్యాన్ని వీడి ఆసత్యాన్ని ఆశ్రయించడం. ఆ రకంగా తాగూత్‌ అనబడే వారు చాలా మంది ఉన్నారు.

ప్రశ్న: వారిని గురించి క్లుప్తంగానయినా తెలుపగలరా?
జ: తాగూత్‌ అనబడే వారు చాలా మంది ఉన్నా పండితులు వారిని ఐదు భాగాల్లో విభజించారు. ఇమామ్‌ ఇబ్నుల్‌ ఖయ్యిమ్‌ (రహ్మ) ఇలా అన్నారు: 1) ఇబ్లీస్‌ – షైతాన్‌. తాగూత్‌ అనబడే వారందరికి పెద్ద గురువు. ఇబ్లీస్‌ ప్రజల్ని మార్గభ్రష్టత్వం వైపునకు, అవిశ్వాసం వైపునకు, నాస్తిక భావాల వైపు నకు, నరకం వైపునకు ఆహ్వానిస్తూ ఉంటాడు. 2) అల్లాహ్‌ను వదలి ఆరాధించ బడే వ్యక్తి. అలా తన్ను దైవంగా కొలవడం అతనికి ఇష్టంగా ఉంటుంది. (మాయిదహ్‌: 60) ఒకవేళ అతనికి ఇష్టం లేకపోతే అతను ఈ కోవలోకి రాడు. ఉదాహరణకు – ప్రవక్త ఈసా (అ). 3) తనకు ఆగోచరాల జ్ఞానం ఉందని వాదించేవాడు. (నమల్‌:65) 4) తన్ను ఆరాధించంమని ప్రజల్ని పిలుపునిచ్చేవాడు. సూపీలలోని కొందరు చేసినట్లు.
5) అల్లాహ్‌ ఆదేశాలకు వ్యతిరేకంగా తీర్మానాలు చేసే వారు. (అన్నిసా:60)

ప్రశ్న: ముస్లిం సమాజంలో అవిశ్వాస పోకడలు ఉన్నాయంటారా?
జ: కొందరిలో ఇలాిం పోకడలు మనకు కనబడతాయి. దానికి కారణాలు ఎన్నో ఉన్నా, మౌలిక కారణాలు మూడు. 1) షుబ్‌హా, జహ్ల్‌, అజ్ఞానం ధర్మ అవగాన రాహిత్యం, అపోహా, అపార్థం. తన ధర్మం గురించి తనకే తెలియక పోవడం. 2) షహ్‌వా – కోరికల దాస్యం.
ముస్లింలలో అవిశ్వాస పోకడలు చాప క్రింది నీరులా ప్రవేశించాయి, ప్రవేశి స్తున్నాయి అని చెప్పొచ్చు. మన తాత ముత్త్తాతలు ఆ కాలంలో ఇస్లామీయ సాహిత్యం లేని కారణంగా, హలాల్‌ మరియు హరామ్‌ గురించి చెప్పే వారు లేని కారణంగా మనలో ఇలాిం విషయాలు చోటు చేసుకు న్నాయి. అలాగే కుట్ర పూరితంగా కొందరిని పావులుగా చేసి ఇస్లాం ధర్మాని కి ఊపిరి విం తౌహీద్‌కు తూట్లు పొడిచే ప్రయత్నాలు పెద్ద ఎత్తున జరిగాయి.

ప్రశ్న: మచ్చుకు కొన్నింని పేర్కొన గలరా?
జ: సూఫీ తెగల వారిని గుడ్డిగా అనిసరించే వారిలో మనకు కనబడే అవిశ్వాస పోకడ, వహ్‌దతుల్‌ వుజూద్‌ మ
రియు వహ్‌ దతుష్‌ షుహూద్‌ అనే అపనమ్మ కం. దీన్నే హులూల్‌ మరియు ఇత్తిహాద్‌ అని కూడా అంటారు. దీన్నే భారత సమాజంలో ద్వైత సిద్ధాంతం, అద్వైత సిద్ధాంతం అనంటారు.

ప్రశ్న: వహ్‌దతుల్‌ వుజూద్‌ మరియు వహ్‌దతుష్‌ షుహూద్‌ అంటే ఏమి?
జ: వహ్‌దతుల్‌ వుజూద్‌ అంటే, ఉన్నదంతా అల్లాహ్‌యే అని విశ్వసించడం. దీన్నే అద్వైత సిద్ధాంతం అంటారు. అద్వైత సిద్ధాంతం అంటే, పరమాత్మ మరియు జీవాత్మ వేరు కాదు; ఒక్కటే అని చెప్పే సిద్ధాంతం. దీన్ని శంకరా చార్యులు ప్రవేశ ప్టోరు. వహ్‌దతుష్‌ షుహూద్‌ అంటే కనిపించే, వినిపించే ప్రతి దానిలోనూ అల్లాహ్‌ను దర్శించుకోవడం. ద్వైత సిద్ధాంతం అంటే పర మాత్మ వేరు జీవాత్మ వేరు. అయితే మనిషి తన స్థాయిని పెంచుకుంటూ దైవం తో కలుసుకుాండు అన్నది. అలాగే హులూల్‌ అంటే, దేవుడే మనిషిగా అవ తరించాడు. ఓ ఉర్దూ కవి ఇలా అంటాడు:
వహీ జో ముస్తవియె అర్ష్‌ థా ఖుదా బన్‌ కర్‌
ఉతర్‌ పడా మదీనె మేఁ ముస్తఫా బన్‌ కర్‌ (అల్లాహ్‌ కాపాడు గాక!)
ఇత్తిహాద్‌ అంటే మనిషి దేవునిలో కలిసి పోయాడు అన్నది. ఇవన్నీ ఇస్లాం ధర్మంతో సంబంధం లేని విశ్వాసాలు. ఇలాంటి విశ్వాసాన్ని ఏ స్థాయి వ్యక్తి కలిగి ఉన్నా మనం వారిని ప్రమాణంగా తీసుకో కూడదు. ఎందుకంటే సత్య ఆధారంగా వ్యక్తిని తూచాలి గానీ, వ్యక్తి ఆధారంగా సత్యాన్ని కాదు.

ప్రశ్న: ప్రార్థన విషయంలో కూడా ఇలాంటి ఉన్నాయంటారా?
జ: ఉన్నాయి. ఉదాహరణకు – సంధ్యా వందనం. ఇది మూడు సమయాల్లో చేయ బడుతుంది. 1) ఉదయం – అ) రాత్రి చివరి భాగం ఆ) నక్షత్రం ఉండగా, నక్షత్రాలు కనుమరుగయ్యాక, ఇ) సూర్యోదయం తర్వాత. 2) మధ్యాహ్నం – అ) సూర్యోదయం 12 ఘడియల తర్వాత. ఆ) సూర్యో దయం తర్వాత 8 నుండి 12 ఘడియల మధ్యన. ఇ) సూర్యోదయం తర్వాత 19 నుండి 24 ఘడియల మధ్యన. ఘడియ అంటే అరగంట అని భావం. 3) సూర్యాస్తమయం తర్వాత – 1) సూర్యుడు అస్తమిస్తుండగా. 2) నక్షత్ర దర్శనం కాకుండా. 3) నక్షత్ర దర్శనం అయ్యాక. ఈ వందనంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను కొలవడం, ఊహించుకోవడం జరుగుతుంది. గాయత్రి మంత్రం, నారయణ మంత్రం చదవడం జరుగుతుంది. ముక్కు కళ్లు మూసు కొని వారిని ఊహించుకోవడం ఆనవాయితీ. బ్రహ్మను నాభిలో, విష్ణువును రొమ్ము భాగంలో, మహేశ్వరుడిని మెదడులో ఊహించుకుాంరు.సూఫీ వర్గానికి చెందిన వారు – ఇస్మ్‌ జాత్‌, నఫీ-ఇస్బాత్‌ సంబంధించి వారు సృష్టించు కున్న ఓ జిక్ర్‌ను కళ్లు మూసకొని, ముక్కు మూసుకుని చదువుతారు. అల్లాహ్‌ా ను స్మరిస్తూ ముర్షిద్‌ను కూడా స్మరించుకోండి అని చెబుతుంటారు.లా ఇలాహ ఇల్లల్లాహ్‌ తౌహీద్‌ వచనంతో వీరు ఎలా చెలగాటమాడుతారో చూడండి! వారు తమ శిష్య జనానికి ఇచ్చే తర్ఫీదు ఏమిటంటే, ‘లా’ అన్న బావాన్ని నాభిలో ఉంచి, ‘ఇలాహ్‌’ అన్న భావాన్ని మెదడులో ఉంచి, ‘ఇల్లల్లాహ్‌’ అన్న భావాన్ని మనసులో ఉంచుకోవాలాంరు. దీన్ని జర్బ్‌గా అభివర్ణిస్తుంటారు. సుబ్హానల్లాహి అమ్మా యుష్‌రికూన్‌. అల్లాహ్‌ వీటికి అతీతుడు, పవిత్రుడు.

1 Star2 Stars3 Stars4 Stars5 Stars (No Ratings Yet)
Loading...

Leave a Reply


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.