New Muslims APP

ఏడు ప్రాణాంతకర విషయాలు

హజ్రత్‌ అబూ హరైరా (ర) కథనం – ”ఏడు ప్రాణాంతకమైన విషయాలకు దూరంగా ఉండండి” అని ప్రవక్త (స) సెలవిచ్చారు. దానికి సహాబా ‘దైవ ప్రవక్తా! ఏమిటవి?’ అని అడిగారు. అందుకాయన ఇలా వివరించారు: ”అల్లాహ్‌కు సహవర్తుల్ని నిల బెట్టడం – షిర్క్‌, చేతబడి చేయడం, అల్లాహ్‌ నిషిద్ధం చేసిన ప్రాణిని అన్యాయంగా చంపడం, వడ్డీ తినడం, అనాథుని సొమ్ము (అన్యాయంగా) తినడం, యుద్ధ సమయంలో వెన్ను చూపి పారి పోవడం, అమాయకులూ, సౌశీల్యవంతులూ అయిన విశ్వాస స్త్రీల మీద అభాండాలు వేయటం”. (బూకారీ, ముస్లిం)

ఒకటి జిన్నాతులు, మరియు షైతానుల సహాయంతో. వాటిని సంతోష పెట్టి కీడు చేసేది. రెండవది-కనికట్టు. త్రాడును పాములా, వేపాకును తేలులా భ్రమింప జేయడం. ఈ రెంటి ప్రస్తావన ఖుర్‌ఆన్‌లో ఉంది. (బఖరహ్‌: 102), (తాహా: 66). రెండు రకాల ఈ విద్యలు హరామ్‌.

మొదటిది – షిర్క్‌:

అల్లాహ్‌ ఉలూహియ్యత్‌ – ఆరాధనలోగానీ, అల్లాహ్‌ రుబూ బియ్యత్‌ – సార్వ భౌమత్వంలోగానీ, అల్లాహ్‌ అస్మా వస్సిఫాత్‌-నామగుణాల్లో గానీ అన్యులను సాటి కల్పించడాన్ని షిర్క్‌ అంటారు. పై మూడింటిలో అధిక శాతం షిర్క్‌ అల్లాహ్‌ ఆరాధన – ఉలూహియ్యత్‌లో చోటు చేసుకుంటుంది. ఉదాహరణకు – అల్లాహ్‌తోపాటు అన్యులను కొలవడం, మొక్కుబడులు చేసుకోవడం, జిబహ్‌ చెయ్యడం, భయ పడటం, ఆశ కలిగి ఉండటం మొదలయినవి. ఇది రెండు విధాలుగా ఉంటుంది.1) షిర్క్‌ అక్బర్‌. 2) షిర్క్‌ అస్గర్‌ – షిర్క్‌ ఖఫీ అంటే ప్రధర్శనా బుద్ధ్ధి (రియా).

షిర్క్‌ అక్బర్‌-పెద్ద తరహా షిర్క్‌: ఇది మనిషిని ఇస్లాం నుండి వెలివేస్తుంది. (వచ్చే సంచికలో అవేమిటి అనేది ‘తౌహీద్‌ వ్యతిరేక పనులు’ అన్న వ్యాసంలో చూసుకో గలరు). ఈ షిర్క్‌కి పాల్పడిన వ్యక్తి తౌబా చేసుకోకుండా మరణిస్తే అతను శాశ్వతంగా నరకంలో ఉంటాడు. ”ఎవడు అల్లాహ్‌కు సహవర్తులుగా ఇతరులను కల్పిం చాడో (షిర్క్‌ చేశాడో) అలాంటి వాని కోసం అల్లాహ్‌ స్వర్గాన్ని నిషేధించాడని తెలుసకోండి. అతని నివాసం నరకాగ్ని మాత్రమే”. (అల్‌ మాయిదహ్‌: 72)

షిర్క్‌ అస్గర్‌ – చిన్న తరహా షిర్క్‌: దీని వల్ల మనిషి ఇస్లాం నుండయితే వైదొల గడు కానీ, తౌహీద్‌ భావనను బలహీన పరుస్తుంది. ఇది పెరిగితే పెద్ద షిర్క్‌కి దారి తీస్తుంది. ఇది రెండు విధాలు. ఒకటి బాహ్య పరమయినది. ఉదాహర ణకు – అల్లాహ్‌ యేతరుల మీద ప్రమాణం చెయ్యడం – ”ఎవరయితే అల్లాహ్‌ యేతరుల మీద ప్రమాణం చేశారో వారు షిర్క్‌కు పాల్పడ్డారు” అన్నారు ప్రవక్త (స). (తిర్మిజీ)

అంతరంగిక పరమయినది-రియా: ప్రదర్శనా బుద్ధి. ఇతరుల మెప్పు కోసం ఆరాధన చేయడం. అంటే అతను అల్లాహ్‌ను మాత్రమే ఆరాధిస్తు న్నాడు కానీ, ప్రజలు అతన్ని మెచ్చుకోవాలనుకుంటున్నాడు. ప్రవక్త (స) ఇలా అన్నారు: ”నాకు మీ విషయంలో ఎక్కువ భయమనేది షిర్క్‌ అస్గర్‌ విషయంలోనే ఉంది”. అందుకు సహాబా ‘ఓ దైవప్రవక్తా! షిర్క్‌ అస్గర్‌ అంటే ఏమి? అని అడిగారు. ‘రియా – ప్రదర్శనా బుద్ధి’ అని ప్రవక్త (స) జావాబిచ్చారు. (తిర్మిజీ)

హదీసె ఖుద్సీలో ఇలా ఉంది: ”(ప్రజలు కట్ట బెడుతున్న) భాగస్వాములందరికంటే ఎక్కువగా నేను షిర్క్‌కు అతీతుణ్ణి. కనుక ఎవరయినా ఒక (మంచి) పని చేసి అందులో ఎవరినయినా నాకు భాగస్వామిగా చేస్తారో, నేను వారికి వారు కట్ట బెట్టిన ఆ భాగస్వామికే అప్పగిస్తాను”. (అంటే అలాంటి ఏ సత్కార్య అవసరం నాకు లేదు) అన్నాడు అల్లాహ్‌. (ముస్లిం)

రెండవది – చేతబడి:

చేతబడి నిషిద్ధం. అవిశ్వాస పోకడ. ఇది రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి జిన్నాతులు, మరియు షైతానుల సహాయంతో. వాటిని సంతోష పెట్టి కీడు చేసేది. రెండవది-కనికట్టు. త్రాడును పాములా, వేపాకును తేలులా భ్రమింప జేయడం. ఈ రెంటి ప్రస్తావన ఖుర్‌ఆన్‌లో ఉంది. (బఖరహ్‌: 102), (తాహా: 66). రెండు రకాల ఈ విద్యలు హరామ్‌. ప్రవక్త (స) అన్నారు: ”ఎవరయితే ఒక మాంత్రికుని వద్దకు వెళతాడో అతని నలభయి రోజుల నమాజు స్వీకరించ బడదు”.(ముస్లిం)
”’అతను చెప్పింది నిజమని నమ్మితే ప్రవక్త (స) వారిపై అవతరించిన దాన్ని తిరిస్కరించనట్టు”. (ముస్నద్‌ అహ్మద్‌)

మూడవది – అన్యాయంగా ఒక ప్రాణిని చంపడం:

”న్యాయ సమ్మతంగా తప్ప – అల్లాహ్‌ నిషేధించిన ఏ ప్రాణినీ హత మార్చ కూడదు”. (బనీ ఇస్రాయీల్‌: 33)
”ఎవరయినా ఒకరి హత్యకు ప్రతీకారంగా కాకుండా, భూమిలో కల్లోలాన్ని రేకెత్తించినందుకు కాకుండా, అకారణంగా ఎవరినయినా చంపినట్లయితే అతడు సమస్త మానవులను చంపిన వాడవుతాడు”. (మాయిదహ్‌: 32)

నాల్గవది – వడ్డీ తినడం:

కొన్ని ప్రత్యేక వస్తువుల్లో అదనపు బాగాన్ని వడ్డీగా అభివర్ణిస్తారు. ఇది మూడు విధాలు. 1) రిబల్‌ ఫజ్ల్‌: రెండు సజాతి వస్తువులను వినిమయ సమయంలో ఒకదానిని ఎక్కువగా తీసుకోవడం. ఉదాహరణకు -10 గ్రాముల 22 క్యారెట్ల బంగారానికి బదులు 12 గ్రాములు 20 క్యారెట్ల బంగారం తీసుకోవడం. 2) రిబన్‌ నసీఅ: రెండు సజాతీ వస్తువుల వినిమయం జరిగిన నిర్ణీత కాలం తర్వాత ఏదో ఒక దాని ప్రతిఫలం ఎక్కువ గా తీసుకోవడం. 3) రిబల్‌ యద్‌: ఈ చేతి నుండి ఇచ్చి, ఆ చేతి నుండి పుచ్చుకోక పోవడం. (వివరాలు వచ్చే సంచికలో వడ్డీ అవగాహనం అన్న వ్యాసంలో చూడ గలరు). ఈ మూడు విధాల వడ్డీలు నిషిద్ధం. ”వడ్డీ తినే వారు, తినిపించే వారిని, తినేవారిని అల్లాహ్‌ ప్రవక్త (స) శపించారు”. (ముస్లిం)

అయిదవది – అనాథ అస్తిని స్వాహా చెయ్యడం:

”అనాథ (తండ్రి లేని బిడ్డ) యుక్త వయసుకు చేరుకునే వరకూ – ఉత్తమ రీతిలో తప్ప – అతని ఆస్తి దరిదాపులకు కూడా వెళ్ళకండి”. (అన్‌ఆమ్‌: 152)
అనాథ ఆస్తిని న్యాయబద్ధంగా మూడు సందర్భాలలో తీసుకోవచ్చు. 1) అప్పుగా. 2) అది తప్ప జీవనాధారం లేని పక్షంలో అవసరం తీరేంత మాత్రమే. 3) దాన్ని కాపాడేందుకు పడే శ్రమకు ప్రతిఫలంగా. (ఇబ్నుల్‌ జౌజీ -రహ్మ)

ఆరవది – యుద్ధం నుండి వెన్ను చూపడం:

”ఓ విశ్వసించిన వారలారా! మీరు అవిశ్వాసులతో (యుద్ధంలో) ముఖాముఖీ అయినప్పుడు వారికి వెన్ను చూపకండి”. (అన్ఫాల్‌: 15) అంటే ఒకరిద్దరి ప్రాణాలకు ముప్పు ఉందని భయ పడి పారి పోకూడదు. హాఁ! ముస్లిం సైన్యం మొత్తానికి అలాంటి భావన కలిగితే అప్పుడు కూడా స్థిరత్వాన్ని ప్రదర్శించాలి, సాధ్యం కాని పక్షంలో మాత్రమే అనుమతి ఉంటుంది.

ఏడవది – అమాయక స్రీల మీద అభాండాలు మోపడం:

”సౌశీల్యవతులుగా ఉన్న, ఏ పాపం ఎరుగని విశ్వసించిన స్త్రీలపై అపనింద మోపేవారు ఇహ పరాలలో శపించ బడ్డారు. వారి కోసం చాలా పెద్ద శిక్ష ఉంది”. (అన్నూర్‌:23)

”శీలవతులయిన స్త్రీలపై అపనిందను మోపి, దానికి సంబంధించిన నలుగురు సాక్షుల్ని తీసుకు రాలేని వారికి ఎనభయి కొరడా దెబ్బలు కొట్టండి. ఇక మీదట ఎన్నడూ వారి సాక్ష్యాన్ని ఆమోదించకండి. వారు నీచ మనస్కులు”. (అన్నూర్‌: 4)
ఇమామ్‌ షఅబీ మరియు జహ్హాక్‌ (రహ్మ) – ”సదరు వ్యక్తి తౌబా చేస కున్న తర్వాత కూడా అతని సాక్ష్యాన్ని పరిగణలోకి తీసుకోవడం జరగదు”. అన్నారు.

1 Star2 Stars3 Stars4 Stars5 Stars (No Ratings Yet)
Loading...

Leave a Reply