New Muslims APP

చెలిమి ఎవరితో?

ప్రశ్న: మనిషిని ప్రభావితం చేయడంలో కీలక పాత్ర పోషించేవి ఏవి?
జ: 1) తల్లిదండ్రులు. 2) స్నేహితులు. 3) గురువు. 4) పరిసరాలు -సావాసం. 5) దేశ కాల పరిస్థితులు.

ఒక వ్యక్తితో మనకు సైద్ధాంతిక, విశ్వాస పరమయిన విరోధం ఉంటే, వారి భావాలతో మనం విభేదించ వచ్చు. కాని వ్యక్తులయిన వారి మేలును కోరుకోవాలి. వారు సయితం సత్యాన్ని గ్రహించి స్వర్గంలో ప్రవేశించాలని తపించాలి.

ప్రశ్న: స్నేహితులు, శత్రులు ఎన్ని రకాలు?
జ: ముందు స్నేహం గురించి తెలుసుకుందాం! శ్రేయం కోరడం వేరు, స్నేహం చెయ్యడం వేరు. వైద్యుడు రోగి శ్రేయాన్ని కోరతాడు, స్నేహాన్ని కాదు. స్నేహమనేది మనిషి విశ్వాసం (అఖీదా)తో ముడి పడి ఉంటుంది. కొంత కాలం కలిసి చదువుకుంటే, కలిసి తిరిగితే, కలిసి ఒక చోట ఉంటే ఏర్పడేది పరిచయమే కానీ, స్నేహం కాదు. అలా పరిచయం అయిన వారిలో మన అభిరుచులు కలిసిన వారితోనే మనమ స్నేహం చేస్తాం. మనకు సంబంధించిన అభిరుచుల్లో అగ్ర భాగం – అఖీదాకు ఉంటుంది, ఉండాలి.
మిత్రులు ముగ్గురు: 1) మనల్ని ప్రేమించేవాడు మన మిత్రుడు. 2) మన మిత్రుణ్ణి ప్రేమించే వాడు. 3) మన శత్రువుని ద్వేషించే వాడు.
శత్రువులు ముగ్గురు: 1) మన శత్రువయిన వాడు. 2) మన స్నేహితునితో శత్రుత్వం గల వాడు. 3) మన శత్రువునికి మిత్రుడయిన వాడు.

ప్రశ్న: ఒక ముస్లిం ఎవరితో స్నేహం చెయ్యాలి?
జ: అల్లాహ్‌ ఇలా సెలవిస్తున్నాడు: ”విశ్వాసులయిన పురుషులు, విశ్వాసుల యిన స్త్రీలు – వారంతా పరస్పరం మిత్రులుగా ఉంటారు. వారు మంచిని గురించి ఆజ్ఞాపిస్తారు. చెడుల నుంచి వారిస్తారు. నమాజును నెలకొల్పుతారు. జకాత్‌ చెల్లిస్తారు.అల్లాహ్‌కు మరియు ఆయన ప్రవక్తకు విధేయులయి ఉంటారు. అల్లాహ్‌ అతి త్వరలో తన కారుణ్యాన్ని కురిపించేది వీరి పైనే. నిస్సందేహంగా అల్లాహ్‌ సర్వాధిక్యుడు, వివేచనాశీలి”. (తౌబహ్‌: 71)

స్నేహానికి అల్లాహ్‌ చెప్పిన అర్హత:
1) అల్లాహ్‌ యెడల స్వచ్ఛమయిన విశ్వాసం.
2) మంచిని ఆజ్ఞాపించడం.
3) చెడు నుండి వారించడం.
4) నమాజు మరియు జకాత్‌ విం ధర్మ విధులను నిర్వర్తించడం.

5) ప్రతి విషయంలోనూ అల్లాహ్‌ మరియు ఆయన ప్రవక్తకు విధేయత చూపడం.
ప్రశ్న: కపటులు మరియు బిద్‌అతీలతో స్నేహం చేయవచ్చా?
జ: కపటుల గురించి – ప్రవక్త (స) ఇలా అన్నారు: ”నిశ్చయంగా నా తర్వాత నేను నా సముదాయం విషయంలో ఎక్కువ భయ పడేది వాక్చాతుర్యం గల కపితోనే”. (ఇబ్ను హిబ్బాన్‌)
ఎందుకంటే ఒక అవిశ్వాసి వల్ల జరిగే నష్టం కన్నా, ఒక కపి వల్ల జరిగే నష్టం చాలా ఎక్కువ. అతను మనతోనే ఉంటూ, మన వేషధారణ కలిగి ఉంటూ, మన భాషలోనే మ్లాడుతూ మనల్నే, ముస్లిములనే వెన్ను పోటు పొడుస్తాడు. కాబట్టి అలా అనుమానం ఉన్న వ్యక్తి విషయంలో కడు అప్ర మత్తంగా ఉండాలి. ఎందుకంటే, ఫలానా వ్యక్తి కపటి అని మనం నిర్థారించ లేము. గుండెల్లోని గుట్టు ఒక్క అల్లాహ్‌కు మాత్రమే తెలుసు. అయితే తగు జాగ్రత్తగా మాత్రం ఉండాలి. ఎందుకంటే ఇలాంటి వ్యక్తులు చూడానికి భలే ధర్మ పరాయణులుగా కనిపిస్తారు. వారు మాట్లాడుతూ ఉంటే చెవొగ్గి వినాల నిపించేంత ఆకర్షణ వారి మాటల్లో ఉంటుంది అని అల్లాహ్‌ హెచ్చరించాడు కూడా.(మునాఫిఖూన్‌: 04)

అలాగే ధర్మంలో వెర్రి పోకడలు పోయేవారి విషయంలో సయితం మనం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ప్రవక్త (స) అన్నారు: ”మీలో ఎవరయినా ఒక చెడు కార్యాన్ని చూస్తే తన చేత్తో (కలం మరియు బలంతో) దాన్ని ఆపడానికి ప్రయత్నించాలి, ఒకవేళ సాధ్యం కాకపోతే, నాలుక (మాట) ద్వారానయినా దాన్ని ఖండించే ప్రయత్నం చెయ్యాలి. అదీ కుదరకపోతే, కనీసం దాన్ని మనస్ఫూర్తిగా అసహ్యించుకోవాలి, (అవకాశం లభిస్తే ఖచ్చితం గా కూకి వ్రేళ్ళతో పెకళిస్తాను అని బలంగా సంకల్పించు కోవాలి). ఇది విశ్వాసపు అధమ స్థాయి” అన్నారు ప్రవక్త (స). (ముస్లిం)

అంటే ప్రతి ముస్లిం మీద ఇది తప్పనిసరి అయి ఉంటుంది. ఒక చెడును చూసి మన మనసులో సయితం ఏహ్య భావం కలగడం లేదంటే మనం దాన్ని సమర్థిస్తున్నట్టే. హజ్రత్‌ అబ్దుల్లాహ్‌ బిన్‌ ఉమర్‌ (ర) ఓ సారి నమాజు కోసమని ఒక మస్జిద్‌లో ప్రవేశించారు. అక్కడున్న ముఅజ్జిన్‌ జూహ్ర్‌ా అజాన్‌ లో ‘తస్‌వీబ్‌’ చేశాడు. (హయ్యా అలల్‌ ఫలాహ్‌ తర్వాత ‘అస్సలాతు ఖైరుమ్‌ మినన్‌ నౌమ్‌’ అని రెండు సార్లు చెప్పడం). అది విన్న ఆయన మస్జిద్‌ నుండి బయిటికి వస్తూ ”బిద్‌అత్‌ నన్ను మస్జిద్‌ నుండి బయటకు వచ్చేలా చేసింది” అని అన్నారు.(అబూ దావూద్‌) మనం ప్రతి జుమా ఖుత్బాలో వినే మాట – కుల్లు బిద్‌అతిన్‌ ద్వలాలహ్‌, వ కుల్లు ద్వలాలతిన్‌ ఫిన్నార్‌ – ప్రతి నూతన పోకడ మార్గ భ్రష్టత్వమే, ప్రతి మార్గభ్రష్టత్వం నరకానికి గొనిపోయేదే”.

ప్రశ్న: యూద, క్రైస్తవుల గురించి ఖుర్‌ఆన్‌ ఏమంటుంది?
జ: ”ఓ విస్వాసులారా! యూదులను, నసారాను (కైస్తవులను) స్నేహితులుగా చేసు కోకండి. వారు ఒండొకరికి స్నేహితులు. మీలో ఎవరయినా సరే వారి లో చెలిమి చేస్తే అతను కూడా వారిలోని ఒకడుగానే భావించ బడతాడు”. (మాయిదహ్‌: 51)
ప్రశ్న: అవిశ్వాసులు, నాస్తికుల గురించి అల్లాహ్‌ ఆదేశం ఏమి?
జ: నిశ్చయంగా మీకు ఇబ్రాహీమ్‌లోనూ, అతని వెంటనున్న వారిలోనూ అత్యుత్తమమైన ఆదర్శం ఉంది. వారంతా తమ జాతి వారితో స్పష్టంగా ఇలా చెప్పేశారు: ”మీతోనూ, అల్లాహ్‌ను వదలి మీరు పూజించే వారందరితోనూ మాకెలాిం (విశ్వాస పరమయినటువిం) సంబంధం లేదు. మిమ్మల్ని (మీ మిథ్యా విశ్వాసాల్ని) తిరస్కరిస్తున్నాము. ఒకే ఒక్కడయిన అల్లాహ్‌ను మీరు విశ్వసించనంత వరకూ మాకూ, మీకూ మధ్య శాశ్వతంగా (సైద్ధాంతిక పరమయిన) విరోధం, వైషమ్యం ఉంటుంది”. (ముమ్తహినహ్‌ా: 4)
ప్రవక్త (స) ఇలా అన్నారు: ”ఎవరు ఏ జాతిని పోలి ఉంటారో వారు ఆ జాతికి చెందిన వారిగానే భావించ బడతారు”. (అబూ దావూద్‌)

ప్రశ్న: సత్యోపదేశం చెయ్యాలంటే స్నేహం తప్పనిసరి కాదా?
జ: ఒకరికి మంచి చెయ్యాలంటే మంచి మనసు ఉంటే చాలు. వారు స్నేహితులో, సన్నిహితులో, పరిచయస్తులో, స్వదేశీయులో, స్వభాషీయులో కానవసం లేదు. ముక్కు, ముఖం తెలియని వ్యక్తి మేలు కోరడమే కదా మానవత్వం అంటే. ఇదే విషయాన్ని అల్లాహ్‌ ఇలా తెలియ జేస్తున్నాడు: ”మంచీ-చెడు (ఎి్ట పరిస్థితిలోనూ) సమానం కాజాలవు. (ఓ ప్రవక్తా!) చెడును మంచి ద్వారా తొలగించు. ఆ తర్వాత (నువ్వే చూద్దువు గాని) నీకూ-తనకూ మధ్య బద్ధ విరోధం ఉన్న అతను సయితం నీకు ప్రాణ మిత్రుడయిపోతాడు”. (యూనుస్‌: 99)

అంటే ఒక వ్యక్తితో మనకు సైద్ధాంతిక, విశ్వాస పరమయిన విరోధం ఉంటే, వారి భావాలతో మనం విభేదించ వచ్చు. కాని వ్యక్తులయిన వారి మేలును కోరుకోవాలి. వారు సయితం సత్యాన్ని గ్రహించి స్వర్గంలో ప్రవేశించాలని తపించాలి. ప్రవక్త (స) వారి జీవితం మనకు నేర్పే పాఠం ఇదే. సైద్ధాంతికంగా ఆయన మక్కా అవిశ్వాసులతో విభేదించినా, అందరి మేలును కోరుతూ ఆయన ఒక్కో వ్యక్తి వద్దకు 70 సార్లకన్నా ఎక్కువ వెళ్ళే వారు. రాత్రిళ్ళు జాగారం చేసి మరి వారి కోసం ప్రార్థించేవారు. ఖుర్‌ఆన్‌లో ఇలా ఉంది: (ఓ ముహమ్మద్‌ (స)!) ఒకవేళ ఈ ప్రజలు ఈ మాటను విశ్వసించక పోతే నువ్వు వారి వెనుక దుఃఖంతో కుమిలిపోతూ నీ ప్రాణాలను పోగొట్టు కుాంవా ఏమి?” (కహఫ్‌: 6)

1 Star2 Stars3 Stars4 Stars5 Stars (No Ratings Yet)
Loading...

Leave a Reply


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.