New Muslims APP

దుశ్శకునం: దుష్ఫలితం

రోజులన్నీ మంచివే:

‘ఫలానా రోజు మంచిది, ఫలానా రోజు మంచిది కాదు’ అన్న నమ్మకం ప్రజల్లో ఉంది. వాస్తవంగా అన్ని రోజులూ మంచివే. అన్ని కాలాలూ మంచివే. మనం చేసే పనులు మంచివయితే ఫలితాలు మంచివి అవుతాయి. మన ఆలోచనలు సక్రమంగా ఉంటే మనం చేసే పనులూ సక్ర మంగా ఉంటాయి. మన సామర్థ్యం, మన జ్ఞానం, మన అనుభవం, మన విశ్వాసం, మన ఆత్మ విశ్వాసం, కార్య ప్రణాళిక, క్రమశిక్షణ వీటి పైనే మన జయాపజయాలు, లాభనష్టాలు ఆధార పడి ఉంటాయి. అయితే కొందరు ఇవేమి పట్టనట్లు తమ నిర్వాకాలకు అన్యుల్ని, సూర్య చంద్ర నక్షత్రాల్ని బాధ్యుల్ని చేస్తారు. ‘మా వాడు మంచి నక్షత్రంలో పుట్టాడు’ అని ఒకడంటే, ‘మీ హస్తవాసి మంచిది’ అంటూనే హస్తానికున్న వాచీ మీద కన్నేసేవాడు మరొకడు. ‘అర చేతి గీత చూసి నీ రాత తెల్చేస్తాను’ అంటాడు ఒకడు. ‘నీ ఇంటి వాస్తు చూసి నీ కొంప కూల్చే స్తానంటాడు’ మరొకడు. ‘నీ బోణి మంచిది’ అని ఒకడంటే, ‘నువ్వు ఎదురొస్తే మంచిది’ అంటాడు ఇంకొకడు. వాస్తవం ఏమిటంటే,
”నీ ప్రభువు తాను కోరిన దాన్ని సృష్టిస్తాడు, తాను కోరిన వారిని ఎంపిక చేసుకుంటాడు. వారిలో ఎవరికీ ఎటువంటి ఎంపిక అధికారం లేదు. అల్లాహ్‌ పరమ పవిత్రుడు. వారు కల్పించే భాగస్వాముల న్నింటికీ ఆయన అతీతుడు, ఉన్నతుడు”. (అల్‌ ఖసస్‌: 68)

”తెలుసుకో! మొత్తం సముదాయం కలిసి నీకు మేలు చేకూర్చ దల చినా, అల్లాహ్‌ా నీ భాగ్యంలో రాసి పెట్టిన దానికంటే ఎక్కువ మేలు చేయ జాలదు. ఒక వేళ వారందరూ కలిసి నీకు కీడు తలపెట్ట దలచినా, అల్లాహ్‌ నీ విధిరాతలో రాసిన దానికంటే ఎక్కువ కీడును కలుగజేయ జాలరు” అన్నారు ప్రవక్త (స). (తిర్మిజీ)

శకునం అనే భావన ఎలాంటిదంటే, దాన్ని ఆశ్రయించిన వ్యక్తిని భయం గుప్ప్లోకి నెట్టుతుంది, అతన్ని తీవ్రంగా నష్ట పరుస్తుంది. దాన్ని పట్టించుకోని వ్యక్తి నుండి అది తోక ముడిచి పారి పోతుంది.

సృష్టి ప్రారంభంలో ఏ రోజు ఏం జరిగింది?

హజ్రత్‌ అబూ హురైరా (ర) గారి కథనం – దైవ ప్రవక్త నా చెయ్యి పట్టుకొని ఇలా చెప్పారు: ”అల్లాహ్‌ భూమిని శనివారం రోజు పుట్టించాడు. భూమిలో పర్వతాలు ఆదివారం నాడు పుట్టించాడు. వృక్షాలను సోమ వారం నాడు పుట్టించాడు. అయిష్టకరమయిన వస్తువులను మంగళ వారం నాడు పుట్టించాడు. కాంతిని బుధ వారం నాడు పుట్టించాడు. భూమిలో జంతువులను గురు వారం రోజు పుట్టించాడు. ఈ వస్తువులన్నింనీ పుట్టించిన తర్వాత చివర్లో శుక్రవారం రోజు అస్ర్‌ తర్వాత ఆదం (అ)ను పుట్టించాడు. పగి చివరి ఘడియ అస్ర్‌ – రాత్రికి మధ్య పుట్టించాడు”. (ముస్లిం)

విధి వక్రించినా, జరగాల్సిన మేలు జరక్కపోయినా ప్రతి దాన్ని అతను ఏదో ఒక వస్తువు శకునంగా భావించి, పరాజయ భారాన్నంతా ఆ వ్యక్తి లేదా వస్తువు మీద నెట్టేసి బాధ్యత నుండి పారి పోయేందుకు ప్రయత్నిస్తాడు. మనిషిలో తిష్ట వేసుకున్న శకున జాఢ్యం అతన్ని ప్రగతి బాటన పయనించకుండా ఆపు తుంది. ఉన్నత స్థాయికి అతను చేరుకోకుండా నిరోదిస్తుంది. అలా అతని ప్రయత్నం వృధా అవుతుంది. అతని ఆశయం నీరుగారి పోతుంది” అన్నారు ఇమామ్‌ మావర్దీ (ర).

శకునానికి విరుగుడు:

‘శకునం అనే భావన ఎలాంటిదంటే, దాన్ని ఆశ్రయించిన వ్యక్తిని భయం గుప్ప్లోకి నెట్టుతుంది, అతన్ని తీవ్రంగా నష్ట పరుస్తుంది. దాన్ని పట్టించుకోని వ్యక్తి నుండి అది తోక ముడిచి పారి పోతుంది. అతనికి ఎలాంటి  నష్టం వాటిల్లదు. అనుకోకుండా వరికయినా ఎప్పుడ యినా ఇలాంటి  ఆలోచన వచ్చినా, ఎవరి ద్వారా ఇలాిం మాట విన్నా, ఇలాంటి దృశ్యాలను కన్నా అతను ప్రవక్త (స) వారు సూచిం చిన ఈ విరుగుడు ప్రార్థన చెయ్యాలి’ అన్నారు ఇమామ్‌ ఇబ్నుల్‌ ఖయ్యిమ్‌ (ర). ”అల్లాహుమ్మ లా ఖైర ఇల్లా ఖైరుక్‌. వ లా తైరా ఇల్లా తైరుక్‌. వ లా ఇలాహ గైరుక్‌”. (అహ్మద్‌) – ”నీ వద్ద మేలయినదే అసలు మేలు, నీ వద్ద కీడయినదే అసలు కీడు. నువ్వు తప్ప వేరే ఆరాధ్యుడు లేడు”.

”అల్లాహుమ్మ లా యాతి బిల్‌ హసనాతి ఇల్లా అన్‌త. వ లా యజ్‌ హబు బిస్సయ్యిఆతి ఇల్లా అన్‌త.వలా హౌల వలా ఖువ్వత ఇల్లా బిక”.

ఓ అల్లాహ్‌ నువ్వు తప్ప మేళ్ళను మాకు ప్రసాదించేవాడు ఎవ్వరూ లేరు. నువ్వు తప్ప మా నుండి చెడులను తొలగించే వాడు ఎవ్వడూ లేడు. నీ అనుగ్రం లేకుండా చెడు నుండి రకణ పొందే ధైర్యం గానీ, సత్కార్యం చేసే శక్తి గానీ మాలో లేదు”. (అబూ దావూద్‌)

శకునం వల్ల కలిగే నష్టాలు

శని, శకున, అరిష్ట భావాలు కలిగి ఉండటం వల్ల కలిగే నష్టాలను మనం పదిగా పేర్కొనవచ్చు.
1) శకునం విశ్వాసానికి విరుద్ధ పదం, నమ్మకానికి వ్యతిరేకం.
2) శకునం వల్ల కీడు సోకడంగానీ, మేలు కలగడం గానీ జరుగదు.
3) శకునం బుద్ధి మాంద్యానికి, వివేక శూన్యానికి నిదర్శనం.
4) శకునం ఆందోళనకు, చపల చిత్తానికి ఆనవాలు.
5) శకునం, కార్య శూన్యతకు ప్రేరకం.
6) శకునం మంచి పనులు కూడా చేయకుండా ఆడ్డుకుంటుంది.
మనిషి ప్రయత్నాన్ని మాన్పించి, పని దొంగగా మారుస్తుంది.
7) శకునం అజ్ఞాన కాలపు అవలక్షణం, మూర్ఖపు చేష్ట.
8) శకునాన్ని నమ్మడం అంటే విధి వ్రాతను తిరస్కరించడమే.
9) శకునం అవిశ్వాసుల గుణం.
10) అల్లాహ్‌ా ఆదేశానికి మరియు ప్రవక్త ముహమ్మద్‌ (స) వారి
సున్నత్‌కు వ్యతిరేకం.

శకున భావన కలిగి ఉన్న వ్యక్తి ఆదేశం

ప్రవక్త (స) ఇలా అన్నారు: ”ఎవరినయితే శకునం అతని పని నుండి ఆపిందో అతను షిర్క్‌కి పాల్పడినట్లు”. (సహీహుల్‌ జామె)
వేరోక ఉల్లేఖనంలో ఇలా ఉంది: ”అతను మాలోని వాడు కాదు; ఎవర యితే శకునాన్ని నమ్ముతాడో, ఎవరి కోసమయితే శకునం చూడ బడు తుందో. ఎవరయితే మంత్రిస్తాడో, ఎవరి కోసమయితే మంత్రించడం జరుగుతుందో. ఎవరయితే చేతబడి చేస్తాడో, ఎవరి కోసమయితే చేతబడి చెయ్య బడుతుందో” అన్నారు ప్రవక్త (స). (సిల్‌సిలతుస్‌ సహీహా లిల్‌ అల్బానీ – రహ్మ)

తెలిసో తెలియకో వెళితే ఏమవుతుంది?

”ఎవరయితే తాంత్రికుని, మాంత్రికు వద్దకు వెళ్ళి వారిని ఏదేని విష యం గురించి అడుగుతారో వారి నలభయి రోజుల నమాజు స్వీకరించ బడదు” అన్నారు ప్రవక్త ముహమ్మద్‌ (స).

అలాంటి వ్యక్తులు చెపింది నిజమని నమ్మితే ఏమవుతుంది?

తాంత్రికుని, మాంత్రికుని వద్దకు వెళ్లి వారు చెప్పింది నిజం అని నమ్మితే, అలాిం వ్యక్తి ముహమ్మద్‌ (స) వారి మీద అవతరించిన దైవ వాణిని (ధర్మాన్ని) తిరస్కరించిన వాడవుతాడు” అన్నారు మహనీయ ముహమ్మద్‌ (స). (సహీహుల్‌ జామె లిల్‌ అల్బానీ -రహ్మ)

ఓ గొప్ప శుభవార్త

”రేపు ప్రళయ దినాన ప్రవక్త ముహమ్మద్‌ (స) వారి సముదాయానికి చెందిన 70 వేల మందిని అల్లాహ్‌ా ఎలాిం లెక్క తీసుకోకుండా స్వర్గం లో ప్రవేశింప జేస్తాడు”అని ప్రవక్త (స) వారు చెప్పిన మాటకు – సహాబా (ర) – ‘ఎవరు వారు?’ అని ప్రశ్నించగా, ప్రవక్త (స) ఇలా బదులిచ్చారు: ”వారే మంత్రించని వారు, మంత్రించుకోని వారు. వారే శకునాన్ని నమ్మని వారు. కేవలం ఒక్క అల్లాహ్‌ మీద మాత్రమే భరోసా ఉంచిన వారు”. (బుఖారీ)
ఈ మొత్తం సంభాషణ విన్న తర్వాత ఒక సహాబీ లేచి ఓ దైవప్రవక్తా! ‘అల్లాహ్‌ా నన్ను ఆ భాగ్యవంతుల్లో చేర్చాలని దుఆ చెయ్యండి’ అని విన్న వించుకున్నారు. ప్రవక్త (స) దుఆ చేశారు. అది చూసిన మరో సహాబీ ‘నా కోసం కూడా దుఆ చెయ్యండి’ అని విన్నవించుకోగా, ప్రవక్త (స) – ”సబఖక ఉకాషా” – ఈ విషయంలో ఉకాషా మీకన్నా ముందు న్నాడు’ అన్నారు. (బుఖారీ)

చివరి మాట:

”ప్రజలారా! ఈ షిర్క్‌ నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి. నిశ్చయంగా అది – ”కటిక చీకటలో నల్లటి రాతి మీద నడిచే నల్లటి చీమ సవ్వడికన్నా ఎక్కువగా, తెలియకుండానే మీలో ప్రవేశించే ప్రమాదం ఉంది” అన్నారు ప్రవక్త (స). అది విన్న సహాబా – ‘అది – షిర్క్‌ చీమ సవ్వడికన్నా ప్రమాదకర అయినప్పుడు మేము ఎలా దాన్నుండి దూరంగా ఉండగలం చెప్పండి!’ అని విన్నవించుకున్నారు. ”అల్లాహుమ్మ ఇన్నా నవూజు బిక మిన్‌ అన్‌ నుష్రిక బిక షైఅన్‌ నఅలముహు, వ నస్తగ్ఫిరుక లిమా లా నఅలముహు” అని చెప్పండి అని హితవు పలికారు ప్రవక్త (స). (ముస్నద్‌ అహ్మద్‌)
అనువాదం: ఓ అల్లాహ్‌! మేము తెలిసి నీతోపాటు అణ్యుల్ని సాటి సహవర్తులుగా చేసి కొవలడం (షిర్క్‌) నుండి నీ శరణు వేడుకుంటు న్నాము. మాకు తెలియక చేసే వాటన్నిం నుండి నీ మన్నింపును కోరుకుంటున్నాము.

1 Star2 Stars3 Stars4 Stars5 Stars (No Ratings Yet)
Loading...

Leave a Reply


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.