New Muslims APP

ప్రభువు ప్రసన్నతకు సోపానం పరీక్ష!

మాకే ఎందుకు ఈ పరీక్ష?

జీవితంలో అవిభాజ్యాంశం పరీక్ష. ”మీలో మంచి పనులు చేసేవారెవరో పరీక్షించే నిమిత్తం ఆయన చావు బతుకులను సృష్టించాడు”. (అల్‌ ముల్క్‌: 2)

స్థితప్రజ్ఞత పరీక్ష లేకుండా సాధ్య పడదు. పరీక్షించ బడినప్పుడు సహనం వహించాలి. సహనం వహించినప్పుడు సుస్థిరత, స్థితప్రజ్ఞత స్థాయి ప్రాప్తిస్తుంది

మార్పుకు సంకేతం పరీక్ష:

”బహుశా వారు మరలి వస్తారేమోనని మేము వారిని మంచి స్థితిలోనూ, దుస్థితిలోనూ పరీక్షించాము”. (ఆరాఫ్‌: 165)

అల్లాహ్‌ ఇష్టానికి నిదర్శనం పరీక్ష:

ప్రవక్త (స) వారిని అడగడం జరిగింది – ‘ప్రజల్లో అత్యంత కఠినంగా పరీక్షించ, పీడించ బడిన వారు ఎవరు?’ అని. దానికాయన: ”దైవ ప్రవక్తలు, ఆ తర్వాత పుణ్యాత్ములు, ఆనక వారిని పోలిన వారు, ఆ పిదప వారిని పోలిన వారు” అని సమాధానం ఇచ్చారు. (తిర్మిజీ)

అల్లాహ్‌ సహాయం ఎప్పుడొస్తుంది?

ఈ మాట అన్నది ఎవరు? ”వాస్తవానికి మీకు పూర్వం గతించిన వారికి ఎదురయినటువండి పరిస్థితులు మీకింకా ఎదురు కానే లేదు. వారిపై కష్టాలు, రోగాలు వచ్చి పడ్డాయి. వారు ఎంతగా కుదిపి వేయ బడా రంటే, (ఆ ధాటికి తాళ లేక) ”ఇంతకీ అల్లాహ్‌ సహాయం ఎప్పుడొస్తుంది?” అని ప్రవక్తలు, వారి సహచరులు ప్రశ్నించ సాగారు. ”వినండి! అల్లాహ్‌ సహాయం సమీపంలోనే ఉంది” (అని వారిని ఓదార్చ డం జరిగింది). (అల్‌ బఖరహ్‌: 214)

ఇమామ్‌ షాఫయీ (రహ్మ)ను అడగడం జరిగింది: ‘సహనం, పరీక్ష, స్థితప్రజ్ఞత-వీటిలో ఏది గొప్పది?’ అని. అందుకాయన సమాధానమిస్తూ – ”స్థితప్రజ్ఞత స్థాయి ప్రవక్తలది. అయితే స్థితప్రజ్ఞత పరీక్ష లేకుండా సాధ్య పడదు. పరీక్షించ బడినప్పుడు సహనం వహించాలి. సహనం వహించినప్పుడు సుస్థిరత, స్థితప్రజ్ఞత స్థాయి ప్రాప్తిస్తుంది” అన్నారు. మరి అంతి స్థిరచిత్తం, స్థితప్రజ్ఞత గల ప్రవక్తలే ”అల్లాహ్‌ా సహాయం ఎప్పుడొస్తుంది?” అని రోధించినప్పుడు, వారి మీద వచ్చి పడిన కష్టాల ముందు మన కష్టాలు ఏ పాటివి? ఆలోచించండి!

పరీక్ష సమయంలో సగటు మనిషి తీరు:

”మనిషి పరిస్థితి ఎలాింది అంటే, అతని ప్రభువు అతన్ని పరీక్షించ దలచి అతనికి గౌరవ మర్యాదలను, అనుగ్రహ భాగ్యాలను ప్రసాదించినప్పుడు అతను (ఉబ్బి తబ్బిబ్బై), ”నా ప్రభువు నన్ను గౌరవనీయుణ్ణి చేశాడయా! అనాండు. మరి ఆయన అతన్ని (మరో విధంగా) పరీక్షిం చదలచి, అతని ఉపాధిని కుదించినప్పుడు, ”అయ్యో! నా ప్రభువే నన్ను పరాభవానికి గురి చేశాడు!” అని వాపోతాడు. (ఫజ్ర్‌: 13,14)

పరీక్ష సమయంలో పూర్ణ విశ్వాసి తీరు:

మేము ఏదో ఒక విధంగా మిమ్మల్ని తప్పకుండా పరీక్షిస్తూ ఉంాము – భయంతో, ఆకలిదప్పులతో, ధన ప్రాణాల నష్టంతో, పండ్ల కొరతతో (పరీక్షిస్తాము)! ఈ సహనమూర్తులకు శుభవార్త ఇవ్వండి. వారికెప్పుడు ఏ ఆపద వచ్చి పడినా, ”మేము ఖుద్దుగా అల్లాహ్‌కు చెందిన వారము, మేము మరలి పోవలసింది కూడా ఆయన వద్దకే కదా!” అని అంటారు. వారిపై వారి ప్రభువు దయానుగ్రహాలు, కారుణ్యం ఉన్నాయి. సన్మా ర్గాన్ని పొందినవారు కూడా వీరే”. (అల్‌ బఖరహ్‌: 157)

అల్లాహ్‌ కరుణ, అనుగ్రహం ఏ విధంగా ఉంటుంది?

”అల్లాహ్‌ ముస్లిం పురుషుణ్ణి, ముస్లిం స్త్రీని – వారి ప్రాణ విషయంలో, వారి సంతాన విషయంలో, వారి ధన విషయంలో పరీక్షిస్తూ ఉంటాడు. చివరికి ఒక్క పాపం కూడా లేకుండా అతన్ని పునీతుణ్ణి చేస్తాడు” అన్నారు ప్రవక్త (స). (తిర్మిజీ)
”నిశ్చయంగా అల్లాహ్‌ దగ్గర ఒక వ్యక్తికంటూ ఒక స్థాయి, గౌరవం ఉంటుంది. ఆ స్థాయికి అతను తన సదాచరణ ద్వారా చేరుకో లేడు. అల్లాహ్‌ అతనికి ఇష్టం లేని విషయాలకు గురి చేసి పరీక్షిస్తూ ఉంాడు. చివరికి అతన్ని ఆ స్థాయికి చేరుస్తాడు” అన్నాడు ప్రవక్త (స). (ఇబ్ను హిబ్బాన్‌)

పరలోక సన్మానం:

”ప్రపంచంలో ఏ చీకూ చింత లేకుండా నిశ్చింతగా జీవించిన వారు రేపు ప్రళయ దినాన – పీడనకు గురి చెయ్యబడిన వారికి లభించే పుణ్య సన్మానాన్ని చూసి ఇలా అభిలషిస్తారు: ”ఒక వేళ ప్రపంచంలో మా చర్మాలు కత్తెరలతో కత్తిరించ బడి ఉంటే ఎంత బాగుండు!”. (తిర్మిజీ)

పరీక్ష సమయంలో ఏం చెయ్యాలి?

1) నిరాశకు లోను కాకూడదు. 2) అఖీదాను కాపాడుకోవాలి. 3) నిలకడ కలిగి ఉండాలి. 4) పండితుల సహచర్యం ఏర్పరచుకోవాలి. 5) ఆత్మ సమీక్ష చేసుకోవాలి. 6) నాలుక, అవయవాలను కాపాడుకోవాలి. 7) వజ్ర సంకల్పం కలిగి ఉండాలి. 8) ప్రజల్ని చైతన్యవంతుల్ని చెయ్యాలి. 9) వాస్తవాన్ని వాస్తవంగా అంగీకరించాలి. 10) విధి రాత పట్ల విశ్వాసాన్ని ధృఢతరం చేసుకోవాలి. 11) బాహ్య కారకాలను అన్వేషించాలి. 12) ప్రవక్త (స) వారి సున్నతులకు ప్రాణం పోయాలి. 13) ఇస్తిగ్ఫార్‌ను నిత్యం చేసుకోవాలి. 14) బాధిత ప్రజల కోసం దుఆ చెయ్యాలి. 15) అత్యధికంగా నఫిల్‌ నమాజులు చేసుకుంటూ ఉండాలి. 16) ఖుర్‌ఆన్‌ పారాయణాన్ని నిత్యం చేస్తూ ఉండాలి. 17) దాన ధర్మాలు చేస్తూ ఉండాలి. 17) ఆపద సమయంలో ఖుర్‌ఆన్‌ మరియు ప్రామాణిక హథీసుల్లో పేర్కొనబడిన దుఆలు చేస్తూ ఉండాలి. 18) అల్లాహ్‌ా యెడల సద్భావం కలిగి ఉండాలి. 19) అల్లాహ్‌ సహాయం తప్పకుండా వచ్చి తీరుతుందన్న దృఢ నిశ్చయంతో ఉండాలి. 20) దీర్ఘ కాలిక భవిష్య ప్రణాళికలను తయారు చేసుకొని ర్టిెంపు ఉత్సాహంతో కష్ట పడాలి.

1 Star2 Stars3 Stars4 Stars5 Stars (No Ratings Yet)
Loading...

Leave a Reply


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.