New Muslims APP

షిర్క్‌ పుట్టు పూర్వోత్తరాలు – 3

‘అమ్ర్‌ బిన్‌ లుహుయ్యి’ మొదట్లో తను గొప్ప భక్తిపరాయణత గల వ్యక్తి, మంచి కార్యాల్లో, దానధర్మాల్లో బాగా పేరున్నవాడు. ప్రజలకు సయితం తనంటే ఎంతో అభిమానం. అతని మాటను శాసనంగా భావించేవారు. చివరికి అతన్నే తమ నాయకుడిగా కూడా ఎన్నుకున్నారు. ‘కాబా’ గృహానికి సంబంధించిన ఏ కార్యం అయినా అతని చేతుల మీదుగానే జరిగేది. క్రమేణా ప్రజలు అతన్ని ఓ మేధావిగా, గొప్ప పుణ్యపురుషుడిగా భావించసాగారు. కొంత కాలం తరువాత తను ‘సిరియా’ దేశానికి వెళ్ళాడు. అక్కడ సిరియా దేశస్థులు విగ్రహారాధన చేస్తూ, జాతరలు నిర్వహిస్తూ, ఎంతో విచిత్ర చేష్టలు చేస్తూ ఉండటం చూసి ప్రభావితుడయ్యాడు. వాటిని సత్యం అని భ్రమించాడు. ఎందుకంటే, అతని దృష్టిలో ఆ దేశం దైవ గ్రంథాలు అవతరించిన నేల! దైవ ప్రవక్తలు నడిచిన పుణ్యభూమి!! ఈ కారణంగానే సిరియన్లను ఇతరులు సయితం గౌరవించేవారు.

‘లాత్‌’ తాయిఫ్‌ ప్రజల ఆరాధ్య శిల్పం. ‘లాత్‌’ అనబడే ఈ వ్యక్తి గొప్ప దానశీలుడు. హాజీలకు అతిథి మర్యాదలు చేసేవాడని అంారు. అతని మరణానంతరం ప్రజలు అతని రూపాన్ని ఓ శిల్పంగా చెక్కుకుని పూజించనారంభించారు.

అలా తను మక్కాకు తిరిగి వస్తూ తనతోపాటు ‘హుబుల్‌’ అనే విగ్రహాన్ని వెంటబెట్టుకు వచ్చాడు. ఆ విగ్రహాన్ని తెచ్చి ‘కాబా’ లోపల ప్టిెంచాడు. ప్రజల్లో ముందు నుండీ అతని పట్ల గౌరవభావం ఎలాగూ ఉంది గనక వారు నోరు మెదపకుండా అతన్నే అనుసరించారు. ‘హిజాజ్‌’ వాసులు ప్రతి విషయంలో మక్కా వారిని సంప్రదించేవారు గనక వారు సయితం విగ్రహారాధనను మెలమెల్లగా ఒంట బ్టించుకున్నారు. అలాగే మక్కా ప్రజల్ని అరబ్బులు గొప్పగా అభిమానించేవారు. అందుచేత వారు కూడా ఈ మహమ్మారికి గురయ్యారు. అయితే అరబ్బు ప్రజల్లో, వారు పల్లె ప్రాంతాలకు చెందినవారైనా – కొద్దోగొప్పొ ఇబ్రాహీమ్‌ (అ) గారి సంప్రదాయాలు మిగిలే ఉండేవి. కాని అమ్ర్‌ బిన్‌ లుహుయ్యి విసిరిన మాయాజాలం వల్ల వారి నమ్మకాల్లో మార్పు వచ్చిన విషయం నిజమే. అయినప్పికీ వారు అల్లాహ్‌ానే నిజ దైవంగా భావించేవారు. కనుకనే ఇలా అనేవారు: ”లబ్‌బైక లాషరీక లక్‌ – ఇల్లా షరీకన్‌ హువ లక్‌ – తమ్‌లికుహు వమా మలక్‌” (నీకు మరెవరూ సాటి లేరు. నీవు కేయించుకున్న వారు తప్ప. వారికి ఎలాిం అధికారం లేదు. వారికి అధికారమిచ్చినవాడివి నీవే). అంటే ‘లా షరీక లక్‌’ తర్వాత ‘ఇల్లా షరీకన్‌….’ అనే పదాలను జోడించుకునే వారు. (ఇది కూడా విగ్రహారాధన క్రిందికే వస్తుంది).

అరబ్బుల అతి ప్రాచీన విగ్రహాల్లో ‘మనాత్‌’ కూడా ఒకి. ఇది ఔస్‌ మరియు ఖజ్రజ్‌ తెగవారి ఆరాధ్య విగ్రహం. ‘లాత్‌’ తాయిఫ్‌ ప్రజల ఆరాధ్య శిల్పం. ‘లాత్‌’ అనబడే ఈ వ్యక్తి గొప్ప దానశీలుడు. హాజీలకు అతిథి మర్యాదలు చేసేవాడని అంారు. అతని మరణానంతరం ప్రజలు అతని రూపాన్ని ఓ శిల్పంగా చెక్కుకుని పూజించనారంభించారు. ఇంకా మక్కా మరియు తాయిఫ్‌ల మధ్యనున్న ‘నఖ్లా’ అనే లోయ ప్రాంతానికి చెందిన ప్రజలు ‘అల్‌ ఉజ్జా’ను తమ ఆరాధనా విగ్రహంగా భావించేవారు. ఈ మూడు విగ్రహాలు అలనాి అరబ్బుల్లో ప్రసిద్ధిగాంచినవి. పెద్ద దేవతలుగా పరిగణించబడేవి. ఆ తర్వాత క్రమేణా బహుదైవారాధన విస్తరించింది. ప్రతి ఊరిలో, ప్రతి వాడలో విగ్రహాలు పుట్టుగొడుగుల్లా పుట్టు కొచ్చాయి. ప్రతి ప్రాంతానికి, గ్రామానికి, కుటుంబానికి, తెగకి ఓ ఆరాధనా విగ్రహం ఉండేది. అలా పూర్తి అరబ్బు ప్రాంతం కొంగ్రొత్త విగ్రహాలతో కిక్కిరిసి పోయింది. దాదాపు ఇదే స్థితి అటు పూర్తి ప్రపంచంలోనూ నెలకొని ఉంది. అలా పూర్తి అరబ్బు ప్రాంతం కొంగ్రొత్త విగ్రహాలతో కిక్కిరిసిపోయింది. ఇలాిం తరుణంలో తళుక్కున మెరిసిందొక ఆశాకిరణం. అల్లాహ్‌ా, ముహమ్మద్‌ బిన్‌ అబ్దుల్లాహ్‌ (స)ను అంతిమ ప్రవక్తగా నియమించి, మక్కా పట్టణంలో ప్రభవింపజేశాడు.ఆయన ప్రజలను కిక చీకట్ల నుండి రక్షించి ‘ఇస్లాం’ అనే కాంతి మార్గంలో నడిపించారు.

ఈ విషయాన్నే ఆ పరమ ప్రభువు ఇలా పేర్కొంటున్నాడు:
”అల్లాహ్‌ విశ్వసించినవారిలో వారి జాతికే చెందిన ఒక ప్రవక్తను ప్రభవింపజేసి వాస్తవంగా వారికి గొప్ప మేలు చేశాడు. ఆ ప్రవక్త దేవుని సూక్తులు విన్పిస్తూ వారి జీవితాల్ని తీర్చిదిద్దుతున్నాడు. వారికి గ్రంథ జ్ఞానాన్ని, వివేకాన్ని బోధిస్తున్నాడు. ఇది వరకు వారు పూర్తిగా అపమార్గంలో పడి ఉండేవారు”. (దివ్యఖుర్‌ఆన్‌ – 3: 164)

బహుదైవారాధన నుండి వారించే వాడిగా, ఏకదైవారాధన వైపు ఆహ్వానించేవాడిగా, నరక శిక్ష గురించి భయపెట్టే వాడిగా, స్వర్గ వనాల గురించి శుభవార్త అందజేసేవాడిగా చేసి అల్లాహ్‌ా మహా ప్రవక్త ముహమ్మద్‌ (స)ను పంపాడు. ”ప్రవక్తా! మేము నిన్ను (ప్రవక్తలు, వారి సముదాయాలపై, ప్రజలందరిపై) సాక్షిగా, శుభవార్త అందజేసేవానిగా, భయపెట్టేవానిగా, అల్లాహ్‌ా ఆజ్ఞతో ఆయన వైపు సందేశం అందజేసేవానిగా, (విజ్ఞాన కాంతుల్ని వెదజల్లే) వెలుగుతున్న దీపంగా చేసి పంపాము”. (దివ్యఖుర్‌ఆన్‌- 33: 45,46)

ఆయన్ను ప్రవక్తగా చేసిన పిదప ఇలా ఆదేశించాడు:
”ఓ ముద్దస్సిర్‌! లే. లేచి (ప్రజలను) హెచ్చరించు. నీ ప్రభువు ఔన్నత్యాన్ని చాటి చెప్పు. నీ దుస్తులు పరిశుభ్రంగా ఉంచుకో. అపవిత్రత, అపరిశుద్ధతలకు దూరంగా ఉండు. ఏ మేలయినా ప్రాపంచిక ప్రయోజనాలు ఆశించి చేయకు. (కష్టాలు వచ్చినప్పుడు) నీ ప్రభువు (ప్రసన్నత) కోసం సహనం వహించు”. (దివ్యఖుర్‌ఆన్‌- 74: 1-7)

పై వచనంలో ‘ఖుమ్‌ ఫ అన్జిర్‌’ అంటే- బహుదైవారాధన గురించి హెచ్చరించు. ఏకదైవారాధన వైపు ఆహ్వానించు అని అర్థం. ‘వ రబ్బిక ఫ కబ్బిర్‌’ అంటే- తౌహీద్‌ (ఏకదైవారాధన) విశిష్ఠతను తెలియపర్చు. ‘వ సియాబక ఫ తహ్హిర్‌’ అంటే- నీ కార్యాలకు బహుదైవ భావన గాలి కూడా సోకకుండా కాపాడుకో. ‘వర్రుజ్‌జ ఫహ్‌జుర్‌’ లో ‘అర్రుజ్‌జ’ అంటే- విగ్రహాలు. అనగా వాటిని త్యజించు. వాటిని విడనాడు. స్వస్తి పలుకు అని అర్థం. అలా అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్‌ (స) ప్రజల్ని ధార్మికంగా చైతన్యవంతుల్ని చేయడంతోపాటు, విగ్రహారాధన నుండి వారించారు. అయితే కొంత మంది మాత్రమే ఆయన్ను విశ్వసించారు. ఎక్కువ మంది నిరాకరించారు. వారు ఇలా ఇన్నారు: ”అల్లాహ్‌ తప్ప మరో ఆరాధ్యుడు లేడని చెబితే గర్వంతో వారు ‘ఏమి! ఓ పిచ్చి కవి చెప్పే మాటలు విని మా దైవాలను వదులుకోవాల్నా?’ అంటారు”. (దివ్యఖుర్‌ఆన్‌- 37: 35,36)

వారికి ప్రతి జవాబుగా ఆ సర్వేశ్వరుడు ఇలా సమాధానమిస్తున్నాడు: ”కాదు. వాస్తవంగా అతను సత్యం తీసుకొచ్చాడు. గత ప్రవక్తల (బోధనల)ను ధృవ పరుస్తున్నాడు. (అలాంటి ప్రవక్తను నిరాకరిస్తే) మీరు తప్పకుండా అతి బాధాకరమైన శిక్ష చవి చూడవలసి వస్తుంది. మీకు లభించే ప్రతిఫలం మీరు చేసుకునే కర్మలను బట్టే ఉంటుంది”. (దివ్యఖుర్‌ఆన్‌- 37: 37,38)

మహా ప్రవక్త (స) ఎన్ని ఇబ్బందుల్ని ఎదుర్కొన్నారో మనందరికీ తెలిసిన విషయమే. చివరికి అల్లా ఆయన్ను ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్న ‘హృదయాల విజేత’గా చేశాడు. ఆయన ద్వారా తన సనాతన ధర్మమైన ‘ఇస్లాం’ను సంపూర్ణం గావించాడు. ఇలా అన్నాడు: ”నేనీ రోజు మీ కోసం మీ ధర్మాన్ని (సమగ్ర జీవన వ్యవస్థగా) పరిపూర్ణం చేశాను. మీ కోసం నా అనుగ్రహాన్ని పూర్తి చేశాను. మీ శ్రేయస్సు కోసం ఇస్లాంను (శాంతి మార్గాన్ని) మీ జీవనధర్మంగా ఆమోదించాను”. (దివ్యఖుర్‌ఆన్‌-5:3)

”ఇకపై ఎవరైతే (ఇలాంటి) దైవ విధేయతా మార్గం (ఇస్లాం) కాదని ఇతర జీవిత విధానాలను (ఇస్లామేతర పద్ధతులను, శాంతిని విచ్ఛిన్న పర్చే చేష్టలను) అవలంబించగోరుతారో వాిని ఎన్నికీ ఆమోదించడం జరగదు. అలాింవారు పరలోకంలో ఘోరంగా నష్టపోతారు”. (దివ్యఖుర్‌ఆన్‌-3: 85)

మహా ప్రవక్త (స) పూర్వపు ప్రవక్తలు, గ్రంథాలు, జాతులు, వారి స్థితిగతుల గురించి తెలియ పర్చడంతోపాటు ప్రళయం వరకు సంభవించబోయే కొన్ని ముఖ్య సూచనలను తెలియజేశారు.

హజ్రత్‌ అమ్ర్‌ బిన్‌ అఖ్‌తబ్‌ అన్సారీ (ర) గారి కథనం: ”దైవ ప్రవక్త (స) మమ్మల్ని నమాజు చేయించారు. ఆ తరువాత వేదికపైకెక్కి జుహర్‌ నమాజు వరకు ప్రసంగించారు. వేదిక దిగి జుహ్ర్‌ నమాజు చేయించారు. ఆ తర్వాత మళ్ళీ వేదిక ఎక్కి ప్రసంగించారు. అస్ర్‌ నమాజు వేళ అయ్యింది. వేదిక దిగి నమాజు చేశారు. మళ్ళీ వేదికపైకెక్కి సూర్యాస్తమయం వరకు ప్రసంగించారు. లోకంలో జరిగింది, జరగబోయేది అన్నీ మాకు తెలియపర్చారు”. (ముస్లిం)

ఆయన (స) చెప్పిన భవిష్యవాణుల్లోని ఓ భవిష్యవాణి ఇది: హజ్రత్‌ అబూ హురైరా (ర) కథనం ప్రకారం దైవప్రవక్త (స) ఇలా ప్రవచించారు- ”దౌస్‌ తెగ స్త్రీలు ‘జుల్ఖలస్త’ విగ్రహం చుట్టూ ప్రదక్షిణ చేయనంతవరకూ ప్రళయం సంభవించదు. ‘జుల్ఖలస్త’ అనేది దౌస్‌ తెగ ప్రజల ఆరాధనా విగ్రహం. అజ్ఞాన కాలంలో వారు ‘తిబాలా’ అనే ప్రాంతంలో ఈ విగ్రహాన్ని పూజించేవారు. ఈ ప్రాంతం ‘యమన్‌’ దేశంలో ఉంది”. (ముస్లిం)

1 Star2 Stars3 Stars4 Stars5 Stars (No Ratings Yet)
Loading...

Leave a Reply


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.